TV: ఆ బాధలు ఇప్పటికీ మర్చిపోలేనివి - జబర్దస్త్ వర్ష..!
రోజూ ఒక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువత మతులు పోగొడుతున్న ఈమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటన గురించి వెల్లడించింది.
ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించిన వర్ష తనకి సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి అంటూ.. కానీ తనకు జబర్దస్త్ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు అని కూడా చెప్పింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. బుల్లితెరను విడిచి పెట్టడం నాకు ఇష్టం లేదు.. అందుకే అప్పట్లో సినిమా ఆఫర్లు వచ్చినా సరే నేను వదులుకున్నాను.. నాకు హీరోయిన్గా చేయాలన్న కోరికలు పెద్దగా ఏమీ లేవు. ఫ్రెండ్, అక్క, వదిన ఇలాంటి సైడ్ క్యారెక్టర్ పాత్రలు వచ్చినా చాలు.
జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. ఇమ్మానుయేల్ తో కలసి స్కిట్లు చేస్తున్నప్పుడు చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. విసిగెత్తిపోయాను ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను హేళన చేశారు. ఇక ఆ సమయంలో ఎంతో బాధ వేసింది ఒంటరినైపోయాను అనిపించింది. అయితే ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మరింతగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది కానీ మా వాచ్మెన్ పిల్లల వల్లే నేను మళ్ళీ ధైర్యాన్ని నింపుకున్నాను. ఇప్పుడు ఆ పిల్లలే నాకు మంచి స్నేహితులు అన్నీ కూడా.. వారిని చదివించుకుంటూ నా జీవితాన్ని గడిపేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ బాధలు ఇప్పటికీ మర్చిపోలేనివి అంటూ తెలిపింది. ఇక సాయంత్రం అవగానే షూటింగ్ నుంచి వచ్చి ఆ పిల్లల్ని చూడగానే నా కష్టం మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది అంటూ కూడా తెలిపింది వర్ష.