టీవీ; మరోసారి రష్మీ ప్రేమను బయటపెట్టిన సుధీర్..!!
సుధీర్ ,రష్మీ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది . దీంతో వీరిద్దరితో ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా గతంలో చాలానే వినిపించాయి కానీ అభిమానులు మాత్రం వీరు ఇద్దరు నిజజీవితంలో ఒక్కటైతే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య స్నేహబంధం మాత్రమే ఉందని చెప్పుకొస్తూ ఉంటారు. దాదాపుగా రెండేళ్లపాటు బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్న సుధీర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ టీవీ 28 ఇయర్ అనే ప్రోగ్రాంలో సుధీర్, రష్మీ జంటగా కనిపించారు.అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.
ఇక ఈ ప్రోమోలో రష్మీపై తనకు ఉన్నటువంటి ప్రేమను సుధీర్ తెలియజేయడం జరిగింది. ఈ ప్రోమో లో సుధీర్ మాట్లాడుతూ మేడం గారు ఎందుకో చాలా కోపంగా ఉన్నారని అనడంతో వెంటనే రష్మి సుదీర్ ని చూస్తూ నువ్వు వస్తావని ఇన్ని రోజులు ఎదురు చూశాను అంటూ ఒక చిన్న స్మైల్ ఇస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్ అని ప్రశ్నించగా రష్మీ మాటలకు సుధీర్ తెలియజేస్తూ నేను ఎక్కడ ఉన్నా నా గుండెల్లో నువ్వే ఉంటావని డైలాగ్ చెప్పడంతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం వీరికి సంబంధించి ఈ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.