TV: యాంకర్ ప్రదీప్ ఒక్క రోజు పారిపోషకం ఎంతో తెలిస్తే షాక్..!
ఆర్జేగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ప్రదీప్ ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఒకపక్క అవకాశాలు వచ్చిన ప్రతి చోట చిన్న చిన్న షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే.. మరో పక్క ఢీ, డ్రామా జూనియర్స్ వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ మరింత క్రేజ్ దక్కించుకున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాకి ఏకంగా హీరోగా నటించి.. ఆ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాలో కూడా ఆయన హీరోగా నటించలేదు. కానీ ఎక్కువగా కమెడియన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. మరొకవైపు బుల్లితెరపై యాంకర్ గా పలు చేస్తూ బిజీగా మారిన ప్రదీప్ ఒక్కొక్క షోకి హీరోల రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ ఉండడం గమనార్హం. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లకు కూడా హోస్టుగా చేసే ఈయన బుల్లితెరపై ఒక షో చేస్తే ఏకంగా రోజుకి రూ.3 లక్షలు ఇవ్వాల్సిందే. అంటే ఒక్కరోజు సినిమా షూటింగ్లో ప్రదీప్ పాల్గొన్నారంటే కచ్చితంగా ఆ రేంజ్ లో ఇవ్వాల్సిందే. ఏది ఏమైనా ప్రదీప్ రేంజ్ భారీగా పెరిగిందనే చెప్పాలి.