TV: బిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ స్టార్..!
ముఖ్యంగా సరికొత్త రూల్స్, గేమ్స్ ఇలా అన్నీ కూడా కొత్తగా ఉండబోతున్నట్లు నాగార్జున కూడా వెల్లడించారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించి కంటెస్టెంట్ లపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా గత కొద్దిరోజులుగా ఈ కంటెస్టెంట్ల విషయంపై అనేక రకాల వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈసారి హౌస్ లోకి టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఆయన భార్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా దుర్గారావు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని కామెంట్లు వినిపించాయి. కానీ అవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి.
కానీ ఈసారి అలా కాకుండా ఆయన ఎంట్రీ పక్కా అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే దుర్గారావు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే తనను మాత్రమే రావాలని చెప్పారని అయితే దానికి తాను ఒప్పుకోలేదని అతడు వివరించాడు. ఇకపోతే టిక్ టాక్ ద్వారా తనకు ఇంత పేరు రావడానికి కారణం తన భార్య అని, తన భార్య లేకపోతే ఈ పేరు వచ్చేది కాదు అని కూడా అతడు స్పష్టం చేశారు. ఇక ఏం చేసినా సరే తామిద్దరం కలిసి చేస్తామని.. బిగ్బాస్ లో కూడా ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని తాను అడిగినట్లు వెల్లడించారు. దుర్గారావు ఇక అందుకు వాళ్లు ఎలా స్పందించారు. ఓకే చెప్పారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.