అత్యధిక టిఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న సీరియల్స్ ఇవే..!
టాప్ 5 లో మూడు స్టార్ మా సీరియల్స్ రెండు జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయని చెప్పాలి. అందులో స్టార్ మా నుంచి బ్రహ్మముడితో పాటు నాగ పంచమి , కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఉండగా.. జీ తెలుగు నుంచి త్రినయిని , ప్రేమ ఎంత మధురం సీరియల్స్ మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్నాయి. లేకపోతే అర్బన్ , రూరల్ రేటింగ్ చూసినట్లయితే స్టార్ మా హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఒక్కొక్క సీరియల్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న నేపథ్యంలో టాప్ 10 లో ఉన్న స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
స్టార్ మా ఛానల్ లో బ్రహ్మముడి సీరియల్ 12.33 టిఆర్పి రేటింగ్ తో మొదటి స్థానంలో నిలవగా.. జీ తెలుగు నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక స్టార్ మా ఛానల్ నుంచి కృష్ణ ముకుందా మురారి సీరియల్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకోగా .. జీతెలుగు నుంచి త్రినయని సీరియల్ నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది. స్టార్ మా నుంచి నాగపంచమి ఐదవ స్థానం, జీ తెలుగు నుంచి పడమటి సంధ్యారాగం ఆరవ స్థానం, జీ తెలుగు నుంచి అమ్మాయిగారు ఏడవ స్థానం, స్టార్ మా నుంచి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఎనిమిదవ స్థానం , స్టార్ మా నుంచి మళ్లీ నిండు జాబిలి 9వ స్థానం, జీ తెలుగు నుంచి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్స్ 10వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.