TV: క్యాస్టింగ్ కౌచ్ పై రష్మీ ఏమన్నదంటే..?

Divya
జబర్దస్త్ యాంకర్ రష్మీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. దీంతో రష్మీ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె సామాజిక విషయాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ బోల్డ్ గా కామెంట్లు చేస్తూ ఉంటుంది. జంతువులపై ఎంతో ప్రేమను కలిగిన ఈమె కుక్కలను బాగా ఇష్టపడుతూ వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా అదే సమయంలో మహిళా శక్తిని చాటే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఎప్పుడు ముందుండే ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించడం పలు ఆసక్తికరంగా మారింది..

ఇకపోతే ఒక విషయంపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్లు స్టార్ లుగా ఎదిగేందుకు క్యాస్టింగ్ కౌచ్ తప్పకుండా ఫేస్ చేసి ఉంటారని అందుకు తప్పకుండా ఒప్పుకోవడం వల్లే టాప్ హీరోయిన్లు అవుతారు అన్న నెటిజన్ల కామెంట్లకి తనదైన స్టైల్ లో స్పందించింది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ లో రాణించే క్రమంలో హీరోయిన్లు ఎంత కష్టపడతారో మీకేం తెలుసు అనే కోణంలో కామెంట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అంతకుముందు కూడా ఇదే విషయంపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

గతంలో అంతకుమించి అనే సినిమాలో నటించిన రష్మి ఈ సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందివ్వలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన ఆమె అవకాశం ఇస్తామంటే వెళ్లడం అన్నది తన దృష్టిలో ఒక ఛాయస్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇలాంటి అవకాశానికి తాను క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టను అని.. దానిని గౌరవిస్తానని కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు కెరియర్ బాగుంటుంది అనిపిస్తే అలా వెళ్లడంలో తప్పు లేదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: