టీవీ: బుల్లితెర మెగాస్టార్ కొడుకుకి అందుకే కలిసి రాలేదా..?
ఎందుకంటే హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే పెద్ద స్టార్ హీరో అయినట్లు ఫీల్ అవుతూ .. ఇచ్చిన అతడి ఎక్స్ప్రెషన్స్ కి అతడి బిహేవియర్ కి ఆటిట్యూడ్ కి నెటిజెన్లు కాస్త ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇతడి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా వార్తలు వైరల్ అవ్వడం గమనార్హం. కానీ ఇప్పటివరకు అతను చేస్తున్న సినిమాలేంటి అన్న ఒక చిన్న అప్డేట్ కూడా ఎక్కడ బయటకు కనిపించలేదు.
మరొకవైపు ఈ తండ్రి కొడుకులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక చంద్రహాస్ సినీ కెరియర్ మొదట్లోనే ఆగిపోయింది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే చంద్రహాస్ సినీ కెరియర్ మొదటిలోనే ఆగిపోవడానికి ఒక కారణం ఉంది అని చెప్పవచ్చు.. అదేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అతనిపై నెగిటివిటీ ఏర్పడడమే కారణం అని.. సోషల్ మీడియాలో.. వీడు హీరో ఏంట్రా బాబు అన్నట్లుగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉండడం.. ఇక ఇలాంటి సమయంలో ఇతడిని హీరోగా పెట్టి నిర్మాతలకు సినిమా తీస్తే ఏమీ మిగలదని అందుకే ఎవరు ముందుకు రావడం లేదని సమాచారం. మరి ఈ ఆటిట్యూడ్ స్టార్ సినిమా చేసి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.