TV: జబర్దస్త్ నటి పవిత్ర నవ్వుల వెనుక ఇన్ని కష్టాలా..?

Divya
తెరపై నవ్వులు పంచే ఎంతోమంది నటీనటుల జీవితాలలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. తెరపై మనకు నవ్వులు పూయిస్తూ కడుపుబ్బ నవ్వించే ఎంతోమంది కమెడియన్ల జీవితాలలో కన్నీటి గాథలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా నటిగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కామెడీతో అందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను వెల్లడించింది.
జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న పవిత్ర జీ తెలుగు సూపర్ క్వీన్స్ 2 కార్యక్రమంతో మరింత పేరు దక్కించుకుంది. సీరియల్ ,సినిమాలతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. నటన అంటే ప్రతి ఒక్కరికి ఒక అందమైన కొలమానం.. అయితే ఆ ఆలోచనతోనే నేను ఆడిషన్స్ దశలోనే వెళ్లగా నన్ను తిప్పి పంపారు. ఇక నా నటన మీద నాకు నమ్మకం ఎక్కువగా ఉండేది. ఆ బలంతోనే మంచి అవకాశాలను వెతుక్కుంటూ ఊరు వదిలి ఇక్కడివరకు వచ్చాను.
కడుపు నింపుకోవడానికి అమ్మ కూలి పనులకు, పాచి పనులకు వెళితే అమ్మకు ఒంట్లో బాగోలేనప్పుడు నేను వెళ్లేదాన్ని.. అలా కష్టపడి ఇంటర్ వరకు చదువుకున్నాను.. ఇక అమ్మ మీద ఆధారపడకూడదని.. నటులు కావాలని ప్రకటన చూసి హైదరాబాదుకి వచ్చాను.. అవకాశం కోసం కొన్ని డబ్బులు కూడా కట్టాల్సి వచ్చింది. కానీ అది మోసం అని తేలిపోయిం.ది కొంతమంది నా ముఖం మీద నా రంగు ఎత్తు గురించి చండాలంగా మాట్లాడేవారు. సినిమా అవకాశాలు అడిగితే వంకర చూపులు చూసిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇక అప్పటికే సినిమాలు సంగతి పక్కన పెట్టి సత్య మాస్టర్ డాన్స్ క్లాస్లో చేరాను. ఇక ఆ తర్వాత పెద్దవాళ్ల పరిచయం ఏర్పడి అవకాశాలు దక్కించుకున్నాను అంటూ ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: