టీవీ: జీవితంలో ఎన్నో కోల్పోయాను - ఐశ్వర్య, తేజస్విని.!

Divya
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు తారసపడతాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్ని మరిచిపోయి సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా బుల్లితెరపై పలు షోలు, సీరియల్స్ చేసే వారి పరిస్థితిలో మరింత అద్వానంగా ఉన్నాయని చెప్పాలి లేకపోతే ఇటీవల ఒక షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య , తేజస్విని జీవితంలో ఎదురైనా చేదు సంఘటనల గురించి గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇకపోతే కస్తూరి, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న తేజస్విని, ఐశ్వర్యాలు తాజాగా తమ జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు. తేజస్విని మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆఖరికి తండ్రి చివరి చూపుకు కూడా నోచుకోలేదు ఇంటర్లో ఉండగా నాన్న చనిపోగా అప్పటివరకు తెలియని నేను.. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరు వెళ్లాను.. కానీ అప్పటికే అన్ని కార్యక్రమాలు చేసేసారు.. నా జీవితంలో అన్నీ కోల్పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మరొకవైపు ఐశ్వర్య మాట్లాడుతూ.. తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని మరింత ఎమోషనల్ అయింది. నేను కడుపులో ఉండగానే నాన్న అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది.  ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. ఒక ఆడదాని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి.. దయచేసి ఇష్టం లేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు అలా పెళ్లి చేసుకుని ఆడవారి జీవితాలను నాశనం చేయవద్దు అంటూ కామెంట్ చేతులు జోడించి మరి కన్నీళ్లు పెట్టుకుంది మొత్తానికి అయితే వీరు ఇద్దరు అందరినీ కంటతడి పెట్టించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: