టీవీ: బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ.. అంతకుమించి అనేలా..?

Divya
ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా జూన్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా సినిమాలోని అనసూయ పాత్రను రివీల్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఇలా పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో.. జి స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కథ ఉంటుంది. అయితే ప్రతి కథలోనూ కూడా హృదయాలను కదిలించే భావోద్వేగం కూడా ఉంటుంది అలాంటి ఒక సుమతి అనే ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ భరద్వాజ్ మెప్పించనుంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన సుమతి పాత్ర గ్లింప్ ని విడుదల చేస్తూ ఆమె పాత్రను కూడా చెప్పడం జరిగింది. ఇక దీనిని  విడుదల చేయగా అందులో చాలా అందంగా రెడీ అవుతుంది. అయితే ఆమెలా రెడీ అవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అని చెబుతున్నారు మేకర్స్.
విమానం చిత్రంలో వీరయ్య అనే ఒక అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని నటిస్తుండగా.. కొడుకు పాత్రలో మాస్టార్ ధ్రువన్ కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో సుమతి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు అనసూయ. అయితే ఈ సినిమాలో ఈ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మొత్తానికైతే అనసూయ ఈ సినిమాతో మరో లెవెల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా అనసూయ ఒకవైపు విలన్ పాత్రను పోషిస్తూనే మరొకవైపు ఇలా బోల్డ్ గా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: