టీవీ: ఆ పిచ్చి వల్లే రెండేళ్లలో 18 సీరియల్స్ రిజెక్ట్ చేశా - రవికృష్ణ..!
అంతేకాదు అప్పుడప్పుడు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ఉంటారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు సంవత్సరాలుగా సైలెంట్ అయిపోయాడు రవికృష్ణ. అయితే ఇంత మంచి యాక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ బుల్లితెర ఆడియన్స్ కూడా కంగారు పడ్డారు. ఇప్పుడు మళ్లీ విరూపాక్షా సినిమాలో భైరవ కుమార్ పాత్రలో మెరిసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు రవికృష్ణ. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఇక్కడ నిజంగానే రవికృష్ణ చేశాడని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.. ఎందుకంటే ఒకప్పుడు బూర బుగ్గలు వేసుకొని అమాయకమైన హీరోలా సీరియల్స్ లో ప్రేక్షకులను అలరించిన రవికృష్ణ ఇప్పుడు పూర్తిగా సిక్స్ ప్యాక్ తో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇకపోతే ఇటీవల తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఏమీ లేదు కదా జీవితంలో ఇంకా ఏం సాధించలేదేమో అని అనుకుంటాను.. సినిమాలంటే నాకు పిచ్చి అందుకే ఈ రెండేళ్లలో సుమారుగా 18 సీరియల్స్ ని నేను రిజెక్ట్ చేసాను సినిమాల కోసం ఏమైనా చేస్తాను అంటూ తెలిపారు రవికృష్ణ మొత్తానికైతే రవి కృష్ణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.