టీవీ: థియేటర్ వద్ద అలాంటి పని చేసి ట్రోల్స్ బారిన పడ్డ బిగ్ బాస్ బ్యూటీ..!

Divya
బుల్లితెర ప్రేక్షకులు ఎన్ని బిగ్ బాస్ షోలు చూసిన సరే బిగ్ బాస్ 6 మాత్రం చాలా వేరుగా ఉందని చెప్పాలి.  ముఖ్యంగా ఇందులో గొడవలు, హౌస్ మేట్స్ మధ్య ఎఫైర్లు,  పంచాయతీలు చూసి ఆడియన్స్ కూడా బుర్రలు బాదుకున్నారు. ఇకపోతే ఈ సీజన్ కంటెస్టెంట్లలో ఒకరైన గీతూ రాయల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాయిస్ వింటేనే చాలు మిగిలిన కంటెస్టెంట్లు కూడా పారిపోయేవారు.  ఎందుకంటే తనతో గొడవ పెట్టుకుంటే ఇక అవతలి వాళ్లకు చిత్తడి అయిపోవాల్సిందే.
ఈమధ్య ఏదో అభిమానుల ఆనందం కోసం వాళ్ళ అభిమాన హీరోల సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.. కానీ దీనికి రెస్పాన్స్ కూడా గట్టిగానే లభిస్తోంది . ఇక నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా దేశముదురు సినిమాను రిలీజ్ చేశారు . ఇంకేముంది అభిమానులు థియేటర్ల వద్ద ఒక రేంజ్ లో గోల చేస్తున్నారు. అందరిలోనూ మన గీతూ రాయల్ కూడా కలిసిపోయింది. అక్కడికి వెళ్లి సినిమా చూసి ప్రశాంతంగా వచ్చిందా అంటే అది లేదు.. స్క్రీన్ పైన అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ లు అన్నీ కూడా ఇక్కడి నుంచి గీతూ చెప్పేసి అందరిని డిస్టర్బ్ చేసింది.
అంతేకాదు అక్కడితో ఆగకుండా స్క్రీన్ దగ్గరకు వెళ్లి గంతులేసి అరుపులు కేకలు ఈలలతో నానా రచ్చ చేసింది.  అంతేకాదు తన డాన్సులతో యువతను ఆకట్టుకుంది. కానీ ఈమె చేసిన గోల ప్రేక్షకులకు విసుగు తెప్పించిందని చెప్పాలి. అయితే ఈమె ఆనందం అక్కడితో ఆగలేదు.. ఆ వీడియోలన్నీ తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూసే నీటిజెన్లు ఈ వీడియోలు చూసి కామెంట్ బాక్స్ ను మొత్తం నింపేశారు.. ఆ గంతులు ఏంది.. ఆ కేక లేంది.. అక్క మమ్మల్ని ప్రశాంతంగా సినిమా చూడనీయవా.. సినిమా మొత్తం చెప్పేస్తావా.. అంటూ రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: