టీవీ: వదినమ్మ సీరియల్ నటి గురించి తెలియని విషయాలు..!!

Divya

స్టార్ మాలో ప్రసారం అవుతున్న  వదినమ్మ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం సీరియల్  తర్వాత ఈ సీరియల్ కి ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్ లో నలుగురు అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం గురించి.. వారి మధ్య ఉన్న ప్రేమ అనురాగాల గురించి ఎంతో అద్భుతంగా చూపించడం జరిగింది. ప్రభాకర్, సుజిత ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే.. సీరియల్ నటి సుజిత గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సుజిత బుల్లితెర పైన అడుగు పెట్టకు ముందే ఒక సినీ నటి.. ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఈమె తల్లిదండ్రులు కూడా ఎస్ మనీ, రాధ ఈమె ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ సోదరి.. తిరువనంతపురంలో వీరు జన్మించడం జరిగింది. అయితే ఈమె వయసు 37 సంవత్సరాలు..1983 లో మొదటిసారిగా సినీ ప్రవేశం చేసింది సుజిత. మొదట పసివాడు ప్రాణం సినిమాతో ప్రధాన పాత్రలో నటించడం జరిగింది.
అంతేకాకుండా ఈమె వెంకటేష్ సినిమాలో చెల్లెలు పాత్రలో కూడా ఒక సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.  అలాగే చిరంజీవి నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. అలాగే కొన్ని సినిమాలలో కూడా అతిథి పాత్రలో నటించింది సుజిత. ఇక ఈమె ప్రకటనలను రూపొందించే ధనుష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ఇక మలయాళం లో స్వాంతం మల్లుటి అనే ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత బుల్లితెర పైన అడుగుపెట్టి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెర పైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజిత వదినమ్మ సీరియల్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె నటనకు గాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: