టీవీ: స్టేజ్ పైనే గుండెలవిసేలా రోదించిన రీతూ చౌదరి.. కారణం..?

Divya
ఒకప్పుడు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సినిమాలలో కూడా అడపాదడపా సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఎప్పుడైతే జబర్దస్త్ లో లేడీ కమెడియన్గా చేసి పాపులారిటీ సంపాదించుకుందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా మారిపోయింది. గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ బికినీలు తలపించేలా దుస్తులు ధరిస్తూ తన సొగసరి అందాలను చూపిస్తూ ఉంటుంది.
ఇకపోతే ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టేజ్ పైనే అందరి ముందు వెక్కివెక్కి ఏడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు వారి కంట చేత కన్నీటిని కూడా పెట్టించింది.. అసలు విషయంలోకి వెళ్తే. పుట్టిన ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక స్నేహితుడే.. తల్లితో కూడా పంచుకోలేని చాలా విషయాలను తండ్రితో పంచుకుంటుంది.  అంత ఆప్యాయత ఉన్న తండ్రి ఒక్కసారిగా దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తాను కూడా భరించాను అంటూ తన తండ్రిని తలుచుకొని చాలా రోదించింది రీతూ చౌదరి. రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యింది. ప్రస్తుతం ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా అందులో రీతూ చౌదరి కన్నీటిని పెట్టుకున్నట్లు మనం చూడవచ్చు.  ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు.
తన తండ్రిని.. తన తండ్రి పంచిన ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ అయినా రీతూ చౌదరిని చూసి అక్కడ ఉన్న తోటి నటీనటులు ఓదార్చే ప్రయత్నం చేశారు.  ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది. ఇకపోతే అతి చిన్న వయసులోనే తన తండ్రి గుండెపోటుతో మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఎప్పుడు గుర్తొచ్చినా సరే ఇలా కన్నీటి పర్యంత మవుతూ అందర్నీ కంటతడి పెట్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: