టీవీ: హైపర్ ఆది పై ఫైర్ అవుతున్న నేటిజన్స్..!!

Divya
జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా హైపర్ ఆది ఒక వెలుగు వెలిగారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం కొనసాగుతూ ఉన్నారు.అక్కడ వరుసగా ఎపిసోడ్లో నటిస్తూ ఉన్నారు హైపర్ ఆది. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కామెడీ పేరుతో హైపర్ ఆది కాస్త వల్గర్ గా ప్రవర్తిస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తనకంటే చాలా పెద్దవారైన మహిళల పట్ల కూడా హైపర్ ఆది చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హైపర్ ఆది చాలా కాలంగా కూడా సీనియర్ నటిమనులతో వివాదాస్పదంగా మాట్లాడడం వారిపైన పంచు డైలాగులు వేయడం వంటివి జరుగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఈసారి సీనియర్ నటి పై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాకుండా ఆయన తీవ్రంగా కూడా ఇబ్బందుల్లోకి నెట్టివేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆడవారిని కనీసం గౌరవించకుండా హైపర్ ఆది చేస్తున్న కామెడీ పైన పలువురు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కామెడీ పేరుతో ఇంతగా రెచ్చిపోయి ఆడవారి మీద అవమానించడం అవసరమా అంటూ హైపర్ ఆది పైన పలువురు మహిళలు కూడా కామెంట్లు చేస్తున్నారు. హైపర్ ఆది మాత్రం తనకు ఎప్పటికీ ఆడవారు అంటే గౌరవం అని ఎప్పుడూ కూడా వారిని చులకనగా చూడనని గతంలో ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. కానీ హైపర్ ఆది కేవలం కామెడీ కోసం మాత్రమే ఇలా ఆడవారి పట్ల కాస్త తక్కువగా మాట్లాడుతూ ఉంటారని సమాచారం. కానీ హైపర్ ఆది తన పద్ధతిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ కూడా పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో హైపర్ ఆది ఈ విషయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: