టీవీ: రాజకీయాల్లోకి మొగలిరేకులు సీరియల్ హీరో.. సక్సెస్ అవుతారా..?

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన సోదరుడు చిరంజీవితో సమానంగా పేరు ప్రఖ్యాకల సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే.. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు థియేటర్ల వద్ద అభిమానుల పండుగ అంతా ఇంతా కాదు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి కూడా వచ్చారు.. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా సరే తన పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్..

ఈ క్రమంలోని చాలామంది పవన్ కళ్యాణ్ కు అభిమానులుగా ఉన్న బుల్లితెర నటీనటులు,  సినీ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తూ జనసేన కండువా కప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే బుల్లితెర సీరియల్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు కూడా బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే తాజాగా ఈయన కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన ఒక ఫోటోను దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన పార్టీలో చేరబోతున్నారని పలువురు భావిస్తున్నారు.. నిజానికి సాగర్ కు బుల్లితెరపై చాలా మంచి క్రేజ్ ఉంది ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లను కూడా ఆయన టార్గెట్ చేస్తూ జనసేన పార్టీలోకి ఈయనను ఆహ్వానించినట్లు కూడా పలువురు తమ అభిప్రాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే సాగర్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటోని షేర్ చేయడం వల్లే ఇలాంటి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఆయన అనుకున్నట్లుగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు ఓట్లు వేస్తారా.. సక్సెస్ అవుతారా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: