టీవీ: ఆ సినిమా హిట్ అయితే ఆది కెరియర్ మారినట్టేనా..?
సార్ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే హీరోకి చాలా క్లోజ్ ఫ్రెండ్ పాత్ర .. ఆది ఇప్పటివరకు ఎప్పుడు చేయలేనిది ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆది మంచి పాత్రను సొంతం చేసుకోవడం జరిగింది అయితే ఈసారి అంతకుమించి అన్నట్లుగా సార్ సినిమాలో ఆయనకు పాత్ర లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ అయితే ధనుష్ యొక్క క్రేజ్ తెలుగులో భారీగా పెరగడమే కాకుండా అదే సమయంలో హైపర్ ఆదికి కూడా ఆఫర్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈటీవీలో అప్పుడప్పుడు కనిపిస్తున్న హైపర్ ఆది త్వరలోనే ఈటీవీ కి గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతోనే మరింత బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సార్ సినిమా సక్సెస్ అయితే అదే జరుగుతుందేమో అని అభిప్రాయాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ధనుష్ వంటి సూపర్ స్టార్ హీరోతో అత్యంత సన్నిహితంగా ఉండే పాత్రను ఆది చేయడం నిజంగా ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆది మునుముందు మరిన్ని మంచి పాత్రలు అందుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని సినీ విశ్లేషకులు, అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.