దీపిక పిల్లితో రొమాంటిక్ డాన్స్ చేస్తున్న సుధీర్.. వీడియో వైరల్..!!

Divya
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా, నటుడుగా, యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు సుడిగాలి సుదీర్. ఇక రీసెంట్ గా గాలోడు సినిమా తో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక బుల్లితెరపై టీవీలో ప్రసారమవుతున్న కొన్ని షో లకీ యాంకర్ గా చేయడమే కాకుండా పలు ఓటీటి షోలకు కూడా యాంకర్ గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేకంగా ఆహా అందుబాటులోకి రావడం జరిగింది. సినిమాలతో పాటు పలు ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పాటు, పలు షో లను కూడా ఇందులో అందిస్తోంది.
డైరెక్టర్ అనిల్ రావుపూడి జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో నిర్వహిస్తోంది .ఈ షోని సుడిగాలి సుదీర్ తో పాటు దీపిక పిల్లి హోస్టుగా వ్యవహరిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా కామెడీ ఎక్స్చేంజి షో నుండి మొదట ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. జనవరి 6న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో చాలా రసవత్తంగా సాగుతోంది. అయితే ఈ షో ప్రారంభంలో సుధీర్ దీపికాల ఇంట్రడక్షన్ సాంగ్ చాలా వైరల్ గా మారుతోంది.

స్టైలిష్ కాస్ట్యూమ్ లో ఇద్దరు కూడా మంచికిచ్చేలా చేశారు పైగా వీరిద్దరూ కలిసి ఇదివరకే వాంటెడ్ పండుగాడు అనే చిత్రంలో కూడా నటించారు. ఇక ఈ సినిమా లో సుధీర్ ,దీపిక మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఆ కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుట్ అయిందో ఈ షోలో కూడా వారిద్దరూ అలాగే కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ పర్ఫామెన్స్ ఎలా ఉందో చూడాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: