టీవీ: తన భర్తతో అలాంటి పని చేయిస్తున్న లాస్య.. వీడియో వైరల్..!!

Divya
ఒకప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే  పలు షోలలో యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ తెచ్చుకుంది యాంకర్ లాస్య. మొదట మ్యూజిక్ లైవ్ షో కి కూడా పనిచేసింది.  అందులో ఫోన్ కాల్స్ ద్వారా కాల్స్ చేసి వారికి నచ్చిన పాటలను ప్లే చేస్తూ ఉండేది. దీంతో యాంకర్ లాస్యకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాతనే యాంకర్ గా తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే యాంకర్ లాస్య జీవితంలో కొన్ని అనుకోని సంఘటనల ద్వారా కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.  వివాహమైన తర్వాత మళ్లీ బుల్లితెర పైన యాంకర్ గా చేస్తూ బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ లాస్య యాంకర్ గా కంటే సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు తమ కుటుంబానికి సంబంధించి పలు ఫోటోలు,  వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఈ క్రమంలో యాంకర్ లాస్య తన భర్త మంజునాథ తో కలిసి చేసిన ఒక సరదా వీడియోని రిజిస్ట్ చేసి అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో మంజునాథ్ అంట్లు కడుగుతూ సోషల్ మీడియా రిలీజ్ లో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పడం జరిగింది.

దీంతో ఈ కామెడీ రీల్ తెగ వైరల్ గా మారుతుంది.  అలాగే యాంకర్ లాస్య మంజునాథ్ దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటున్నారని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.ఇదంతా ఇలా ఉన్నప్పటికీ యాంకర్ లాస్య ఆమధ్య పలు చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ప్రస్తుతం అటు బుల్లితెర వెండితెరను వదిలేసి కేవలం ఇల్లాలుగా సెటిలైందని చెప్పవచ్చు.  ప్రస్తుతం తమ ఫ్యామిలీతో కలిసి హైదరాబాదులో ఉంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా యాంకర్ లాస్య చెప్పిన చీమ ఏనుగు జోకులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: