సింగర్ రేవంత్ ను "అగ్రెసివ్...ఫిజికల్" అంటూ ఏడిపించేశారుగా !

VAMSI
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చి ఆ సంఖ్య కాస్త 12 కు పడిపోయింది. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లలో సూర్య మరియు గీతు ల విషయంలో ఇంటి సభ్యులు అస్సలు లైట్ గా తీసుకోలేకపోయారు. కాగా ఇప్పుడు హౌస్ లో రేవంత్, శ్రీహన్ , శ్రీసత్య , ఫైమా , ఆదిరెడ్డి, రాజ్ , బాలాదిత్య , కీర్తి , ఇనాయా, మెరీనా, రోహిత్ మరియు వాసంతిలు ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లలో రోహిత్, రాజ్ మరియు శ్రీసత్య లు కాకుండా మిగిలిన 9 మంది ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో రేవంత్, శ్రీసత్య , రాజ్ , బాలాదిత్య మరియు మెరీనా లు ఒక గ్రూప్ గా మరియు ఆదిరెడ్డి , రోహిత్, శ్రీహన్ , కీర్తి మరియు ఫైమాలు ఒక గ్రూప్ గా ఉండి గేమ్ ఆడుతున్నారు.
ఇక ఈ టాస్క్ కు బిగ్ బాస్ నాగమణి అన్న పేరును పెట్టారు..ఈ టాస్క్ లో ఇనాయ మరియు వాసంతిలు సంఛాలక్ లుగా ఉన్నారు. అయితే ఈ టాస్క్ లో ఆపోజిట్ టీం వాళ్ళు రేవంత్ ను ఫిజికల్ అవుతున్నాడు అన్నదాన్ని ఒక సాకుగా పెట్టుకుని తనను మాటలతో రెచ్చగొట్టి తనకై తానే టాస్క్ లో ఆడకుండా ఉండేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది రేవంత్ మైండ్ ను బాగా దెబ్బ తీసింది.. ఇక తన గ్రూప్ లో వాళ్ళు కూడా తనకు సపోర్ట్ గా లేకుండా తన ఎఫర్ట్స్ ను కామెడీ గా తీసుకుంటున్న వైనం రేవంత్ అభిమానులను ఎంతో చిరాకుకు గురిచేసింది అని చెప్పాలి. ఇక టాస్క్ లో చివరకు రేవంత్ అండ్ టీం ఓడిపోయింది.. దీనితో కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు.
ఇక శ్రీహన్ బిగ్ బాస్ సూచన మేరకు కెప్టెన్సీ పోటీదారుడు అయ్యే అవకాశాన్ని కోల్పోవడంతో శ్రీహన్ ను ఆ ప్లేస్ లో వేరొకరికి అవకాశం కల్పించాలని కోరాడు. అప్పటికే బాగా అప్సెట్ అయిన రేవంత్ కు శ్రీహన్ ఆ అవకాశం ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ శ్రీహన్ చాలా సింపుల్ గా శ్రీసత్య కు ఇవ్వడం రేవంత్ న బాగా కృంగదీసింది. ఇలా అన్ని విషయాల గురించి బాగా ఆలోచించుకుని రేవంత్ కన్నీటి పర్యంతం అయ్యాడు. తన భార్య ఫోటోను తీసుకుని నేనేందుకు బిగ్ బాస్ కు వచ్చాను అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: