టీవీ: బిగ్ బాస్ ద్వారా గీతు రాయల్ ఎంత సంపాదించిందో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ షో పై పలు నినాదాలు వినిపిస్తూనే ముఖ్యంగా ఇందులో ఉండే కంటెస్టెంట్ల పైన ఇలాంటి నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయినప్పటికీ కూడా ఈ షో ప్రసారం అవుతూనే ఉంది.కొన్ని నెలల క్రితం వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనటువంటి నటి గీతూ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ లో కూడా తన మాటలతో నటన తో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ కావడం జరిగింది. గీతూ రాయల్ అతి వల్ల బిగ్ బాస్ షో కాస్త డ్యామేజ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఎట్టకేలకు ఈమె ఎలిమినేట్ కావడంతో ఇప్పటినుంచి బిగ్ బాస్ షోను చూస్తారా అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.


ప్రేక్షకులలో ఆమెపై ఏ స్థాయిలో నెగిటివిటీ ఉందో సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ షో వల్ల గీతూ రాయల్ కెరియర్ కు మైనస్ అయిందని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉంటేనే మంచి పాపులారిటీ వచ్చేది కేవలం బిగ్ బాస్ లోకి వెళ్లి ఉన్న పరువును కాస్త పోగొట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా గీతూ రాయల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈమెకు ఈ పరిస్థితి ఏర్పడిందని మరి కొంతమంది నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


బిగ్ బాస్ నిర్వాహకులు  ప్రతి వారానికి రూ.25,000 రూపాయల చొప్పున గీతూ రాయల్ కు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తొమ్మిది వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గీతు రాయల్  కేవలం రూ.2.25 లక్షల రూపాయలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది కంఠస్టెంట్లతో పోలిస్తే ఇమే అందుకున్నది చాలా తక్కువ పారితోషకమని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ షో ద్వారా గీతూ రాయల్ కు సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: