టీవీ: పెళ్లి కాకుండానే ఎంజాయ్ చేస్తున్న ఈ జంట..!!

Divya
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో రాకేష్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ లో చిన్న పిల్లలతో స్కిట్లు చేయించే రాకేష్ ఈ మధ్యకాలంలో పలువురు అమ్మాయిలతో కలిసి స్కిట్లు చేస్తూ ఉన్నారు. అలా జోర్దార్ సుజాత, రాకేష్ కలిసి స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు అనే సంగతి బుల్లితెర మీద తెలియజేయడంతో ఇదంతా కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే అనే విధంగా ఉంటుంది అని ప్రేక్షకుల సైతం అనుకున్నారు కానీ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నట్లు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు కూడా తెలియజేశారు.

ఇక సుజాత కూడా యాంకర్ గా చేస్తూ బిగ్ బాస్ ఛాన్స్ అందుకొని ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి రాకేష్ టీమ్ లో చేస్తూ ఉంది. ఇక రాకేష్, సుజాతల మధ్య సంథింగ్ సంథింగ్ అని కొన్ని రోజులు వినిపించిన మాట చివరికి వాస్తవమే అయ్యాయని చెప్పవచ్చు. అందుచేతనే వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే చోటు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వివాహం కాకుండానే సుజాత అత్తగారి ఇంట్లో వెళ్లి అక్కడ సందడి చేయడం జరిగింది. ఇక రాకే సుజాత ఇద్దరు కూడా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు కాబట్టి తమ కెరియర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.

రాకేష్, సుజాత ఇద్దరూ కూడా వరంగల్ ప్రాంతానికి చెందినవారు కావడం వల్ల వీరిద్దరి మనసులు కూడా కలిశాయని తెలుస్తోంది.మరి వీరిద్దరూ వివాహ వార్త ఎప్పుడు చెబుతారో అని ఆడియన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం వీరిద్దరూ కలిసి జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. ఇక రాకేష్ ని బాగా అర్థం చేసుకున్న అమ్మాయిగా సుజాత ఫర్ఫెక్ట్ జోడి అంటూ జబర్దస్త్ టీమ్స్ మెంబర్స్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: