టీవీ :విష్ణు ప్రియ పై చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు..!

Divya
ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో సినిమాలలో కూడా నటిస్తూ మరింత ఇమేజ్ అంతం చేసుకుంటుంది. మరోపక్క ఫాలోవర్స్ ను పెంచుకునే విధంగా సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ వొలక పోస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇదిలా ఉండదు ఎవరో తన అకౌంటును హ్యాక్ చేశారంటూ హంగామా చేసిన విష్ణు ప్రియ ఇప్పటికీ తన అకౌంటును విడిపించుకోలేక తంటాలు పడుతోంది. సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేసినా.. ఎఫ్బికి రిక్వెస్ట్ చేసిన ఎవరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు.

ప్రస్తుతం ఈమె పరిస్థితి చూసి అయ్యో పాపం అంటూ ఫీల్ అవుతున్నారు నెటిజన్స్.. ఈమె స్టేటస్ లో వచ్చే బూతు బొమ్మలు చూడలేక తల పట్టుకుంటున్నారు అన్ ఫాలో చేస్తూ తన పరిస్థితి తల్చుకుంటూ ఫీలవుతున్నారు. అంతేకాదు ఎవరికి కంప్లైంట్ చేసినా సరే తన అకౌంటు తనకు కాకుండా పోవడంతో చేతులెత్తేశారు . ఇక చేసేదేం లేక అప్పటినుంచి ఇప్పటివరకు తనను ఫేస్బుక్లో అన్ ఫాలో చేయండి అని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను వేడుకుంటూనే ఉంది. విష్ణు ప్రియ ఫేస్ బుక్  హ్యాక్ చేసిన హ్యాకర్ మాత్రం రోజురోజుకు రెచ్చిపోతున్నాడు.  విష్ణు ప్రియ స్టేటస్ లో బూతు ఫోటోలు,  పోర్న్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాడు. తన ఫాలోవర్స్ ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె  ఫీలైపోతుంది ఇక ఆ స్టేటస్లు చూసి ఆమె ఫాలోవర్స్ అలాగే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమె పరిస్థితి చూసి జాలి పడుతున్నారు.
తన అకౌంట్ ఎలాగైనా సరే రికవరీ చేసి విష్ణు ప్రియకు ఇవ్వాల్సిందిగా ఫేస్బుక్ వారిని కోరుతున్నారు. ఈరోజు మరి దారుణంగా హ్యాకర్ వ్యవహరిస్తున్నాడు దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు.  మరి ఇప్పటికైనా ఈ సైబర్ నేరగాళ్ళని పోలీసులు కట్టడి చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: