టీవీ: సుజాత కు ప్రేమ పరీక్ష పెట్టిన రాకింగ్ రాకేష్..!!

Divya
ప్రముఖ యాంకర్ సుజాత అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా తెలంగాణ యాసతో న్యూస్ చదువుతూ ఉంటుంది. ఇలా పాపులర్ అయిన సుజాతకు దీంతో బిగ్ బాస్ లో కూడా అవకాశం లభించింది. బిగ్ బాస్ -4 లో ఈమెను నాగార్జున అందులో బిట్టు బిట్టు అని పిలుస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. బిగ్ బాస్ లో వచ్చినందుకు ఈమెకు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ తన టీమ్లో ఆర్టిస్టుగా చేర్చుకొని పలు అవకాశాలను కల్పించారు. దీంతో మరింత పాపులర్ అయింది ఈమె. అలా రాకింగ్ రాకేష్, సుజాత కొద్ది రోజులపాటు పలు స్కిట్లను చేయడం జరిగింది.
అలా వీరిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ కూడా మొదలైందని చెప్పవచ్చు.వీరిద్దరూ నిజమైన లవర్స్ అని చెప్పిన కూడా అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇది కూడా జబర్దస్త్ లో ఒక ట్రాక్ లోనే భాగమే అని అందరూ అనుకున్నారు. కానీ వీళ్లు మాత్రం నిజంగానే ప్రేమలో ఉన్నామని తెలియజేశారు అంతేకాకుండా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని కూడా తెలియజేయడం జరిగింది. ఇలా రాకేష్ తో ప్రేమలో ఉన్న ఆమె పెళ్లికి ముందే అతని ఇంట్లోకి వెళ్లి వరలక్ష్మీ వ్రతం కూడా చేసినట్లు సమాచారం.

ఇక  వీరీద్దరి ప్రేమను ఒక షో ద్వారా తెలిపిన వీళ్లు పెళ్లి విషయంలో కూడా ఆ డేటును గెటప్ శ్రీను ద్వారా ఒక షోలు ప్రకటించడం జరిగింది. తాజాగా వీరిద్దరూ ఒక షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేటప్పుడు భగవంతుడు తనకి ఎన్నో పరీక్షలు పెట్టారని. కానీ నువ్వు స్మశానానికి తీసుకువెళ్లి నాకు పరీక్ష పెట్టావ్ అంటూ ఎమోషనల్ అయింది సుజాత. నాకు కోట్లాది రూపాయలు కావాలి.. కార్లలో తిప్పే వాళ్ళు కావాలనుకోలేదు. కేవలం నా కన్నీళ్లు తుడవడానికి జీవితాంతం నువ్వు నా పక్కన ఉంటే చాలు అంటూ కంటతడి పెట్టడంతో రాకేష్ వచ్చి సుజాతను హత్తుకొని ఓదార్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: