టీవీ: జబర్దస్త్ రోహిణి బూతు పురాణం..గోకొచ్చు అంటూ..?

Divya
తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ కమెడియన్ రోహిణి కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదటపలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా వెళ్లడం జరిగింది. ఆ తరువాత కొన్ని కామెడీ షోలలో కూడా కనిపించింది. ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటిలో తనకంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది రోహిణి. ఇక అంతే కాకుండా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది రోహిణి. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా కూడా చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, వచ్చే డబల్ మీనింగ్ డైలాగులు బూతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. కొంతమంది టీం లీడర్లు అదే పనిగా ఇలాంటి సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలలో హైపర్ ఆది కూడా గతంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోకి రోహిణి కూడా చేరిపోయింది. ఇక ఈ అక్టోబర్ 21 ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో చాలా వైరల్ గా మారింది. ఇందులో రోహిణి స్కిట్ కు సంబంధించి విడాకుల గురించి చేయడం జరిగింది.

ఇక ఇందులో పలు ఎమోషన్స్ సీన్స్ ని రోహిణి ఒక బూతు పంచులతో చాలా గబ్బు గబ్బు చేసిందని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా విడాకుల తర్వాత సమాజంలోని ఒక మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనే విషయాన్ని స్కిట్ రూపంలో చూపించడం జరిగింది. అయితే ఈ స్కిట్లో మాత్రం చాలా చండాలమైన డైలాగులతో సన్నివేశాలను నాశనం చేసింది రోహిణి అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. రోహిణి కి విడాకులు వచ్చాక నేను స్వేచ్ఛ జీవిని నన్ను ఎవరైనా గోకవచ్చు.. గెలకచ్చ.. నా మనసు దోచుకోవచ్చు..అంటూ డైలాగ్ చెబుతుంది. అయితే ఇందులో కేవలం మగాళ్లు మాత్రమే బూతు పంచులు వేసేవారు. కానీ ఇప్పుడు రోహిణి కూడా వేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: