టీవీ: బుల్లితెరపై సుధీర్ మళ్లీ సక్సెస్ అవుతారా..?

Divya
జబర్దస్త్ ప్రారంభం కాకముందు సుడిగాలి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. చిన్న చిన్న ఫంక్షన్లలో మ్యాజిక్ చేస్తూ తన పొట్టు నింపుకునేవారు.అలాంటి సుధీర్ కి జబర్దస్త్ లో అవకాశం రావడంతో ఎన్నో సినిమాలలో నటించేందుకు అవకాశం వచ్చాయి. ఇప్పుడు హీరోగా కూడా వరుస సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉన్నప్పటికీ గుర్తింపు రాలేదు. సుధీర్ కు ఇంతటి పేరు రావడానికి ముఖ్య కారణం మాత్రం ఈటీవీలో ప్రసారమయ్యే పలు షో లే అని చెప్పవచ్చు. దీంతో ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులను కూడా సంపాదించారు సుదీర్. ఈమధ్య జబర్దస్త్ ను వీడి స్టార్ మా లో ప్రసారమయ్యే పలు షో లలో యాంకర్ గా చేస్తున్నారు.


కానీ అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయరు. అయితే సుధీర్ అక్కడికి వెళ్లగానే ఆ షో మొత్తం క్యాన్సల్ అవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ అవకాశాలు పూర్తిగా కోల్పోయారు. దీంతో సుధీర్ ఇటు సినిమాలలో అటు బుల్లితెరపై కనిపించకపోవడంతో అభిమానులు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా సినిమాలు చేస్తున్న జనాలు పెద్దగా గుర్తించుకోలేదు. ఇక బుల్లితెర పైన కూడా ఎంటర్టైన్మెంట్ అందించకుండా కంటిన్యూ చేయడం అంటే అది అసాధ్యమని కూడా పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు.


ఈటీవీలో ఉన్నన్ని రోజులు సుధీర్ కు బుల్లితెర పైన సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. కానీ ఇప్పుడు అటు బుల్లితెరపై కూడా కనిపించలేదు. దీంతో సుధీర్ ఇప్పుడు అభిమానులను మెప్పించే సామర్థ్యం ఉందా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆహాలో ప్రసారం కాబోతున్న ఒక కామెడీ షోలో సుడిగాలి సుదీర్ ముఖ్య పాత్రలు కనిపించబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి రాజా ప్రోమో కూడా ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. మళ్లీ సుధీర్ బుల్లితెర పైన సక్సెస్ అవుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: