టీవీ: లక్షలు పెట్టి కారు కొన్న రచ్చ రవి.. అంతగా ఎదిగాడా..!!

Divya
రచ్చ రవి జబర్దస్త్ కమెడియన్ మంచి పేరు సంపాదించారు. ఇక ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఎందుచేత అంటే ఎన్నో సినిమాలలో కమెడియన్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తర్వాత చమ్మక్ చంద్ర టీమ్ లో రచ్చ రవి చేసిన కామెడీ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. అయితే జబర్దస్త్ మానివేసిన తర్వాత జబర్దస్త్ కమెడియన్ గానే ఈయనను ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే ఈ మధ్య ఖరీదైన కారుకొని మళ్లీ వార్తలలో నిలిచారు రచ్చ రవి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అయితే రచ్చ రవి కారు కొనడంతో ఆయన అంతగా ఎదిగాడా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి జబర్దస్త్ మానేసిన తర్వాత రచ్చ రవికి పలు సినిమాలలో పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడెప్పుడో గద్దల కొండ గణేష్ సినిమాలో నటించిన రచ్చ రవి ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక పలు షోలు చేసిన కేవలం లక్ష రూపాయలు లేదంటే రెండు లక్షలు వస్తాయి అని చెప్పవచ్చు. ఇవి కాకుండా బయట కూడా పెద్దగా ఈవెంట్లలో ఏమి కనిపించలేదు.

ఈ మధ్యకాలంలో ఏ కామెడీ షో లో కూడా రచ్చ రవి ఆకట్టుకున్నట్లు  కనిపించలేదు. అయితే తాజాగా ఖరీదైన కారుని ఎలా కొన్నాడు అనే విషయంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. దసరా పండుగ సందర్భంగా రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేశారు ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా కార్లో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ కారు ధర రూ.20 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం ఒక సాధారణ కమెడియన్ ఇంత ఖరీదు పెట్టి కారుకున్నాడు అంటే సంపాదన ఏ రేంజ్ లో ఉన్నదని విషయం ఇప్పుడు హోటల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: