టీవీ: అందరి ముందు తన లవ్ స్టోరీని బయటపెట్టిన జబర్దస్త్ వర్ష.. ఎవరంటే..?

Divya
జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్ల సైతం జబర్దస్త్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన వారిలో రష్మీ సుధీర్ జంట తర్వాత అంతటి పాపులర్ స్థానాన్ని సంపాదించుకున్నారు వర్ష,ఇమ్మానుయేల్. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. అయితే తాజా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ప్రోమో  ఒకటి విడుదలయ్యింది. ఈ ప్రోమో లో జబర్దస్త్  వర్ష పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

జబర్దస్త్ వర్ష,ఇమ్మానుయేల్ మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తున్నట్లుగా ఎన్నో స్కిట్లు లలో చూపించడం జరిగింది. ఇక ఒకటి రెండుసార్లు వీరిద్దరికీ వివాహం కూడా చేశారు. అయితే ఇదంతా కేవలం స్కిట్ లో భాగమే అన్నట్లుగా తేలిపోయింది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉండడంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుంది అని అప్పుడప్పుడు జడ్జిలు కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే గతంలో వర్ష ఇమ్మానియేల్ పైన పలు రూమర్లు రావడంతో జబర్దస్త్ వీడి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది వర్ష. ఇక అప్పటినుంచి అంతగా వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ లేదని చెప్పవచ్చు.

ఇదంతా ఇలా ఉండగా తాజాగా వర్ష మాట్లాడుతూ తన లవ్ సీక్రెట్ ను బయటపెట్టింది. వర్ష తన లవ్ స్టోరీ చెబుతూ రీసెంట్ గా నాలుగు నెలల క్రితం నుంచి మేము సరిగ్గా మాట్లాడుకోవడం లేదు అందులో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ అంటూ ఒకసారి గా ఎమోషనల్ అయింది. అయితే ఈ విషయం ఇమ్మానుయేల్ ముందు చెప్పడంతో అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇంతకు వర్ష లవర్ ఎవరు అనే విషయం తెలియాలి అంటే ఈ షో పూర్తిగా వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: