బిగ్ బాస్ 6: శ్రీ సత్య డబ్బు కోసమే వచ్చిందా ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవ వారంలోకి అడుగు పెట్టాము. అయితే గత వారం హౌస్ నుండి అభినయశ్రీ మరియు షానీ సాల్మన్ రూపంలో ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో హౌస్ లో ఒక్కసారిగా ఎలిమినేషన్ భయం అందరినీ చుట్టుముట్టింది. సో ఈ వారం హౌస్ లో ఆటను బాగా ఆడుతామని హోస్ట్ నాగార్జునకు మాటిచ్చిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి పాపులర్ అయ్యి ఈ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అందరికీ ఇక్కడ మేము ఏమిటో నిరూపించుకుని ఇంకా కెరీర్ లో పైకి రావాలని అనుకుంటారు. అయితే ఇదే హౌస్ లో ఉన్న ఒక అమ్మాయి మాత్రం బిగ్ బాస్ హౌస్ కు ఎందుకు వచ్చిందో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
ఆమె ఎవరో కాదు సీరియల్ లో నటించి తనకంటూ పేరును సంపాదించుకుని బిగ్ బాస్ హౌస్ వారు వచ్చేసిన శ్రీ సత్య. చూడ్డానికి అందంగా నాజూకుగా ఉండే సత్య... తనకు నచ్చిన వారితో మాత్రమే క్లోజ్ గా ఉంటుంది. ఇక మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే అలవాటును కలిగి ఉంది.  కాగా గత వారంలో తనను నాగార్జున మరియు ఇంటి సభ్యులు కొందరు వేస్ట్ అన్న ముద్ర వేయడంతో చాలా ఫీల్ అయింది. అంతే కాకుండా ఈమెను బిగ్ బాస్ జైలుకు కూడా పంపడంతో కొంచెం కృంగిపోయింది. ఈ సందర్భంలో జైల్లో ఉన్న సత్య తో గీతు మాట్లాడడానికి వచ్చి నీ ప్రవర్తన మాట తీరు మార్చుకోవాలి అని సలహా ఇస్తుండగా.. మధ్యలో సత్య తనను ఆపి నేను ఇక్కడకు నటించడానికి రాలేదు.
బిగ్ బాస్ కు నేను వచ్చింది కేవలం డబ్బు కోసం మాత్రమే అని అందరికీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ కు వచ్చే వారికి డబ్బు ఖచ్చితంగా కావాలి. అలాగని పబ్లిక్ గా డబ్బులే ముఖ్యం అని చెబితే ప్రేక్షకుల దృష్టిలో చెడ్డగా మారే అవకాశం ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అన్నది అందరూ ఆమెను విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: