టీవీ: రెండు రోజుల సైమా కోసం అన్ని లక్షలు తీసుకున్న శ్రీముఖి..!!
ఇక ఈ సమయం అవార్డుల ఫంక్షన్ కోసం శ్రీముఖి భారీగానే పారితోషకాన్ని తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు రోజుల డేట్లు ఇచ్చినందుకుగాను శ్రీముఖి ఏకంగా రూ.12 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. అందులో విమాన ప్రయాణ ఖర్చుల తో కలుపుకొని శ్రీముఖికి అన్ని లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఒకవైపు ఈటీవీలో ఎన్నో షోలలో చేస్తూ ఇతర చానల్లో కూడా చాలా బిజీగా ఉంది శ్రీముఖి. ఇక సినిమాలలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నది.
ఈమధ్య శ్రీముఖి ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఆమె ఎవరితో ప్రేమలో ఉందనే విషయం మాత్రం తెలియజేయలేదు. దాదాపుగా 6 నెలల నుంచి కూడా ఇప్పటివరకు తన ప్రియుడు ఎవరనే విషయాన్ని చెప్పకపోవడంతో ఆమె అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఉన్నారు. తనే సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందుచేతనే ఇతర భాషల యొక్క యాంకర్స్ కంటే శ్రీముఖికి ఎక్కువగా రెమ్యూనరేషన్ దక్కించుకుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏడాదైనా తను వివాహం చేసుకోబోయే విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి శ్రీముఖి.