టీవీ: ఆ లెటర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది.. ఏమైందంటే..?
తాజాగా సెప్టెంబర్ 18 తేదీన ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక ప్రోమో విడుదల చేశారు. జోడి నంబర్ వన్ పేరుతో ఈ ఎపిసోడ్ డిజైన్ చేయడం జరిగింది. సుజాత , రాకింగ్ రాకేష్ రొమాంటిక్ పర్ఫామెన్స్ ప్రోమోకు ఆకర్షణగా నిలుస్తోంది. ఇక పంచ ప్రసాదు కూడా తన భార్యతో కలిసి హాజరయ్యారు. దీనితో పంచు ప్రసాద్ రియల్ లైఫ్ ని స్కిట్ రూపంలో కొందరు చేసి చూపించారు. కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ అతడి భార్య తన భర్త కోసం ఎంతగానో పరితపిస్తుందో చూపించారు.. ప్రేమించిన వాడి కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమ్మాయి చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కేలా చేస్తోంది ఈ స్కిట్ అంటూ ప్రసాద్ భార్య ను హైపర్ ఆది ప్రశంసించారు.
ఆ తర్వాత వారి గర్ల్ ఫ్రెండ్స్ ని ఎత్తుకొని మ్యూజికల్ చైర్స్ కూడా ఆరాడు. యాంకర్ రష్మి ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి లవ్ గిఫ్ట్స్ వచ్చాయని చెబుతుంది. ఆదికి కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. ఆ గిఫ్ట్ చూడగానే హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదేమిటంటే అది టెన్త్ క్లాస్ లో రాసిన ప్రేమ లేఖ తాను రాసిన తొలిప్రేమ లేఖను చూసుకొని ఎమోషనల్ అయ్యారు. టీనేజ్ లో తొలిప్రేమ చేసిన తీపి గాయాన్ని తలుచుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.