సింగర్ రేవంత్ పై అంత వ్యతిరేకతా ?

VAMSI
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఇష్టపడి ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్... ఈ షో మొదలై ఇప్పటికే అయిదు సీజన్ లను ఎంతో సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఆరవ సీజన్ ను స్టార్ట్ చేసింది. ఈ సీజన్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే దాదాపుగా చాలా మంది కంటెస్టెంట్ లు యు ట్యూబర్స్ మరియు సోషల్ మీడియా రంగానికి చెందిన వారే కావడం విశేషం. పైగా ప్రజలకు తెలిసిన వాళ్ళు తక్కువ మంది మాత్రమే. అందులో టాలీవుడ్ సింగర్ రేవంత్ ఒకరు.
అయితే నిన్న హౌస్ లో నామినేషన ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒక్కక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది. అందులో ఎక్కువ ఓట్లు సింగర్ రేవంత్ కు రావడం అతని అభిమానులకు పెద్ద షాక్ అని చెప్పాలి. కాగా నామినేట్ చేసిన వారందరూ చెప్పిన కారణం ఒకటే. రేవంత్ మాట్లాడే విధానం హార్స్ గా ఉంటుంది, తాను చెప్పింది వాస్తవం అని ఎదుటివాళ్ళు నమ్మాలని అనుకుంటాడు అంటూ కారణాలు చెప్పారు.
అయితే సింగర్ రేవంత్ బయట ఒక మంచి సింగర్ గా చాలా కొనసాగుతున్నాడు. జీవితంలోనూ ఎటువంటి వివాదాలు కూడా లేవు. కానీ బిగ్ బాస్ లో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ? టైటిల్ ఫేవరెట్ గా అనుకుంటున్న వ్యక్తికి హౌస్ లో ఇంత వ్యతిరేకత రావడం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటూ బయట ఇతని పై చర్చలు జరుగుతున్నాయి. మరి అతను తన తప్పులనుండి నేర్చుకుని ముందు ముందు అందరికీ నచ్చేవాడిలా ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది.  ఇక ఈ వారం ఇతనితో పాటుగా చంటి, శ్రీ సత్య, పైమా, ఇన్నయ్య , ఆరోహి మరియు అభినయశ్రీ లు నామినేషన్ లో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: