టీవీ: జడ్జ్ ప్రియమణి డాన్స్ ప్రాక్టీస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్గా ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు పొందింది. మొదటిసారిగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలలో నటించి టాప్ హీరోల సరసన కూడా నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక మొదటిసారి ద్రోణ సినిమాలో బికినీ ధరించి తనలోని అందాలను సైతం ప్రదర్శించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉన్నది.

 బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. మరి ముఖ్యంగా తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోకు జడ్జ్ గా ఉండడమే కాకుండా కొంతమంది మాస్టర్ లతో కూడా కలిసి స్టెప్పులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ప్రియమణికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. ఇటీవల తన టీం తో కలిసి ఒక డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో  చాలా వైరల్ గా మారుతోంది.ఆ వీడియోలో ప్రియమణి చాలా కష్టపడి డాన్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది.

అంతేకాకుండా ఈ వీడియోని చూసిన అభిమానులు నేటిజన్లు సైతం ప్రియమణి తిరిగి మళ్లీ హీరోయిన్గా సినిమాల్లో నటించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నది. అయితే వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు కూడా గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. చివరిగా ప్రియమణి నారప్ప సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇక తర్వాత విరాటపర్వం సినిమాలో కూడా నక్సలైట్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ప్రియమణి ప్రస్తుత ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు బుల్లితెరపై పలుసోనకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: