టీవీ: మన తెలుగు యాంకర్స్ ఎంతవరకు చదువుకున్నారో తెలుసా..!!
బుల్లితెరపై ఫిమేల్ యాంకర్లలో స్టార్గా కొనసాగుతున్న వారిలో సుమ ఒకరు. తెలుగు లో ఎన్నో షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ స్టార్ పొజిషన్లో ఉన్నది. సుమ ఎంకామ్ వరకు చదువుకున్నది. ఇక అలనాటి యాంకర్ ఆయన ఝాన్సీ గతంలో ఒక వెలుగు వెలిగింది ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో సినిమాలలో పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఈమె బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుకుంది. ఇక మరొక యాంకర్ ఉదయభాను ఈమె కెరియర్ ఆరంభం నుంచి ఒకవైపు సూళలు మరొకవైపు యాంకర్ గా తమ కెరీర్ను కొనసాగిస్తూనే ఉన్నది.
అలా బుల్లితెరపై అప్పట్లో కూడా ఎన్నో షోలలో యాంకర్ గా వ్యవహరించి మంచి పేరు సంపాదించింది. ఈమె ఎం ఏ చదివింది. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ మొదట న్యూస్ ప్రెసెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత పలు షో లలో యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలలో నటిస్తూ బాగా పాపులర్ అవుతోంది అనసూయ హైదరాబాదులో ఎంబీఏ పూర్తి చేసింది. ఇక మీ యాంకర్లలో యాంకర్ ప్రదీప్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ బీటెక్ చదివారు.. ఇక యాంకర్ లాస్య సిబిఐటి నుంచి బీటెక్ చేసింది. ఇక మిగిలిన వారిలో రష్మీ ,హరితేజ, శ్యామల, వర్షిణి వంటి వారు డిగ్రీ చదివారు. ఇక సుధీర్ కేవలం ఇంటర్మీడియట్ చదివారు.