టీవీ: గుప్పెడంత మనసు జగతి రియల్ లైఫ్ స్టోరీ..!!
జగతి అసలు పేరు జ్యోతి రాయ్.. ఈమెను ముద్దుగా జ్యోతి లేదా జగతి అని పిలుస్తూ ఉంటారు. 1985 జూలై 4వ తేదీన జన్మించిన ఈమె ప్రస్తుతం 36 సంవత్సరాలు వయసులో తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక ఈమె కర్ణాటక రాష్ట్రంలోని మడికేరిలో జన్మించింది. కాలేజీ సమయంలోనే యాక్టింగ్ మీద ఇష్టం ఏర్పడడంతో కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనేది. ఇక తన చదువును పూర్తి చేసిన తర్వాతనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన స్టడీస్ పూర్తి చేసుకున్న తర్వాతనే కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలను అందుకున్న ఈమె.. కన్నడ సీరియల్స్ లో చాలా వరకు నటించి అక్కడ నుంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో దాదాపు పది సంవత్సరాల క్రితం నిరుపమ్ ప్రధాన పాత్రలో నటించిన కన్యాదానం అనే సీరియల్ లో కూడా నటించింది. ఇక ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తుంది. ఈమెకు వివాహం కూడా జరిగింది..భర్త పేరు పద్మనాభం. అతను నెట్వర్క్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక జగతి, పద్మనాభం దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.