టీవీ: అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడం వెనుక అతడి హస్తం ఉందా..?

Divya
యాంకర్ అనసూయను బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. చూడ చక్కని అందంతో పాటు, మంచి ఫిజిక్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ అయిన అనసూయ ఇక అక్కడి నుంచి ఈమె తన కెరీర్ ని మొదలు పెట్టింది. జబర్దస్త్ కి అనసూయ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.. ఇప్పుడు తాజాగా అనసూయ జబర్దస్త్ గుడ్ బై చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అభిమానులు సైతం కాస్త కంగారు పడుతున్నారు. అనసూయ పై వేసే డబల్ మీనింగ్ డైలాగులు, అమే అందాల ఆరబోత జబర్దస్త్ కు మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉండేది.

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇక మరొకవైపు నటన పరంగా కూడా ఈమె శభాష్ అనిపించుకునేలా నటిస్తూ ఉన్నది. అటు బుల్లితెర , వెండితెర రెండిటిని తనదైన స్టైల్ లో మెయింటైన్ చేస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇమేకు స్టార్ హీరోయిన్ రేంజిలో స్టార్డం రావడంతో బుల్లితెరపై ఈమె క్రేజ్ భారీగానే పెరిగిపోయింది. అటు వెండితెర పైన కూడా పలు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అనసూయా చేతులో ప్రస్తుతం ఆరడజన్ సినిమాలు ఉన్నట్లుగా సమాచారం. తాజాగా ఆరి అనే సినిమాకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక అనసూయ ఒక విషయాన్ని పోస్ట్ చేస్తూ.. నాకు తెలుసు ఇది తన కెరీర్లు అతిపెద్ద నిర్ణయమని కానీ ఇలా చేయక తప్పలేదు ఎన్నో స్వీట్ మెమోరీస్ నా వెంట తీసుకు వెళుతున్నాను అంటూ తెలియజేసింది. ఇక మీరంతా కూడా ఎప్పుడు నాతోనే ఉంటారని ఆశిస్తున్నాను అంటూ అనసూయ ఒక విషయాన్ని తెలుపుకొచ్చింది. అయితే అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం తన స్నేహితుడు అయిన డైరెక్టర్ ఫ్రెండ్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనసూయక మంచి క్రేజీ ఉంది ఇప్పుడే కెరియర్ పైన కాస్త దృష్టి పెట్టు అని హింట్ ఇవ్వడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే అనసూయ స్పందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: