టీవి: బుల్లితెర పై రష్మీ కి ప్రపోజ్ చేసిన కమెడియన్ తండ్రి.. వీడియో వైరల్.?

Divya
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రస్తుతం కొత్త దారిలో నడుస్తున్నది. కమెడియన్లు, ఫ్యామిలీ మెంబర్ లతో స్కిట్లు చేయిస్తూ ఉంది. ఒక స్పెషల్ డేస్ అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులముందుకు వస్తూనే ఉంది. ఇక ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా కమెడియన్లు తమ ఫాదర్ల ను పిలిపించారు. వారితో స్కిట్స్ చేయించడం జరిగింది. అలా మొత్తానికి నూకరాజు తండ్రి, సుజాత ఫాదర్, బుల్లెట్ భాస్కర్ తండ్రి, బాబి ఫాదర్ ఇలా అందరూ స్టేజి మీదికి రావడం జరిగింది. తమతమ స్టైల్లో పంచులతో బాగా ఆట పట్టించారు. ఇక శాంతి కుమార్ కూతురు నవీన్ కొడుకు కూడా బాగా షో ను నిర్వహించడం జరిగింది.

అయితే ఇందులో జబర్దస్త్ బాబి తండ్రి మాత్రం రష్మి మీద ఎక్కువ పంచులు వేయడం జరిగింది.. ఎందుకు వచ్చావని అడగగా రష్మీ ఉంది కదా అని తెలియజేశారు. ఇక్కడికి రావడం వల్ల రష్మితో మాట్లాడొచ్చు అని తెలిపారు. ఇక తన ఫోన్ నెంబర్ రష్మీ కి ఇవ్వడానికి రెండు చీటీ ల లో రాసుకొచ్చాడు. అలా రెండు చీటీ లు ఎందుకు రాసుకొచ్చారు అని అడగగా ఇక్కడ పూర్ణ కూడా ఉంది కదా అని ఆమెకు కూడా ఇద్దామని తెలియజేశారు. ఇక ఇలాగే ఉంటే తన తండ్రి తనను మించి పోతారని స్టేజి మీద నుంచి తీసుకువెళ్ళాడు బాబి.

అయితే అలా వెళ్లకుండా బాబీ తండ్రి ఇంకో పని ఉంది ఆగు అని రష్మీ వద్దకు వెళ్తారు.. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ.. నువ్వు ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను అంటు రష్మి ముందు మోకాళ్ళమీద నిల్చొని చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. మొత్తానికి అలా అలా ప్రపోజ్ చేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో రష్మీ సుధీర్ మధ్య జరిగిన ఈ మాటలు ఎంత వైరల్గా మారాయి దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: