రెండో పెళ్ళికి సిద్ధం అవుతున్న ఆ లేడీ యాంకర్ ?

VAMSI
ప్రముఖ యాంకర్ స్వప్న గురించి అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరీర్ మొదట్లో ఎఫ్ ఎం రేడియో లో జాకీగా పనిచేయడమే కాకుండా... దూరదర్శన్ లోనూ కొంతకాలం వరకు పని చేసినట్లు తెలుస్తోంది. అయితే కెరీర్ లో మరింత స్పీడ్ ఉండాలని ఆలోచించిన స్వప్న తెలిసిన వారి సహాయంతో టీవీ 9 లాంటి నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ లో జాయిన్ అయింది. అయితే ఇక్కడ తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతుల ఆందుకుని తన టాలెంట్ తో తక్కువ కాలంలోనే యాంకర్ గా బాగా ఫేమస్ అయింది. అయితే ఆ తర్వాత సాక్షి మరియు 10 టీవీ లాంటి ఛానెల్ లోనూ పని చేసి మంది గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె చేసే ఇంటర్వ్యూ లు కూడా చాల రియలిస్టిక్ మరియు కొత్తగా ఉంటాయి.
ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ అయితే యూత్ లో మంచి పేరును తీసుకువచ్చింది. ఇక తన కెరీర్ లో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి నటిగా కొంత అనుభవాన్ని గడించింది. అయితే చాలా మంది యాంకర్ లలాగే ఈమె కూడా కెరీర్ కోసం తన వైవాహిక జీవితాన్ని వదులుకుంది. గతంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. చాలా కాలం నుండి ఈమె ఒంటరిగానే జీవిస్తోంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈమె రెండవ పెళ్లి చేసుకుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. యాంకర్ స్వప్న ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని భోగట్టా. ఇందుకోసం స్వప్న అమెరికా వెళ్లిందట.
ఇందుకు సంబంధించిన పెళ్లి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం ఇదంతా ఫేక్ అంటూ చెబుతున్నారు. అయితే వాస్తవం ఏమిటి అన్నది ఇంకా తెలియలేదు. మరి స్వప్న ఏమైనా స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: