షాకింగ్ నిర్ణయం తీసుకున్న యాంకర్ ప్రదీప్ ?

VAMSI
ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అంజి చిత్రం తర్వాత ఎక్కువగా బుల్లితెరవైపుకు మళ్లింది. ఇక అప్పటి నుండి ఈటివి తో టై అప్ అయ్యి ఎన్నో విజయవంతమైన షో లను, సీరియల్స్ ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక షో హిట్ అవ్వాలంటే ఆ షో నిర్మాతలు కంటే ...షో లో వచ్చే పార్టిసిపంట్స్ మరియు జడ్జ్ లే కీలకం అన్న విషయం తెలిసిందే. అలాగే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలో వచ్చిన ఢీ, జబర్దస్త్ , క్యాష్ వంటి ప్రోగ్రామ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఏళ్ల తరబడి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నాయి. అయితే ఇపుడు ఢీ, జబర్దస్త్ షో లకు ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదనే చెప్పాలి.
ఇందుకు ముఖ్య కారణం ఈ షో ల నుండి బెస్ట్ ఆర్టిస్టులు బయటకు వెళ్లిపోవడమే. ముందుగా మల్లెమాల నిర్వహిస్తున్న జబర్దస్త్ షో నుండి నాగబాబు గారు బయటకు వచ్చేయగా.. ఇక కొన్నాళ్ళ తర్వాత హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, వంటి వారు సైతం సైడ్ అయిపోయారు. సేమ్ ఇదే తరహాలో ఢీ షో నుండి కూడా హైపర్ ఆది, పిల్లి దీప, రేష్మి, సుదీర్, పూర్ణ లు బయటకు వచ్చేశారు. దాంతో ఈ షో కి కాస్త క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. అయితే యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ షో భారాన్ని ఎక్కువగా తన భుజాలపై వేసుకుని ఇప్పటి వరకు మోసి నిలబెట్టగా
..ఇపుడు ప్రదీప్ మాచినేని కూడా మల్లెమాలకు దూరం అవనున్నారు అని సమాచారం.
ఇప్పటికే అందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారట ప్రదీప్. త్వరలో మల్లెమాలతో తనకున్న అగ్రిమెంట్ ముగియనున్న తరుణంలో ఇకపై మల్లెమాల ఎంటర్టైన్మెంట్ తో చేయకూడదని ప్రదీప్ నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. మొదట నాగబాబు గారు జబర్దస్త్ వీడి వెళ్లగా అప్పట్లో ఆయన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పట్లో ఒకరు ఇద్దరు తప్ప పెద్దగా ఎవరూ బయటకు వెళ్లడం జరిగేది కాదు. కానీ గత ఏడాది నుండి చాలా మంది కీలక ఆర్టిస్ట్ లు మల్లెమాల ప్రొడక్షన్ నుండి తప్పుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: