టీవీ: జబర్దస్త్ నుంచి మరొకరు సైడ్ అవ్వబోతున్నారా..?

Divya
తెలుగు బుల్లితెరపై బాగా కామెడీ షోగా జబర్దస్త్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిన విషయమే. బుల్లితెర షో కు రాని రేటింగ్ కూడా ఒకప్పుడు జబర్దస్త్ షోకి వస్తూ ఉండేది. అద్భుతమైన జబర్దస్త్ కామెడీ షో ఎన్నోసార్లు వేస్తూ ఉండేవారు. అంతగా పాపులర్ అయిన విషయం ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితి కి దిగజారిపోయింది అని చెప్పవచ్చు. మొదట ఈ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు సైడ్ అవ్వడంతో జబర్దస్త్ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు లేకపోయినా కూడా అందులో ఉండే ఆర్టిస్టుల సైతం బాగా ఆకట్టుకుంటూ ఉండడంతో ఎలాగోలా నేట్టుకుంటూ వచ్చారు.

ఇక తాజాగా కొద్ది రోజుల క్రితం రోజా కూడా జడ్జి పదవి నుండి తప్పుకోవడంతో జబర్దస్త్ షో కి మరిన్ని కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. రోజా వెళ్లిపోవడానికి కొద్ది రోజుల ముందు నుండే హైపర్ ఆది కూడా ఇందులో కనిపించలేదు. కానీ మళ్ళీ తిరిగి వస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ రోజా వెళ్లిపోయిన కూడా ఆది తిరిగి రాకపోవడంతో ప్రతి ఒక్కరు హైపర్ ఆది కూడా ఈ షో మానేశారని డిసైడ్ అయ్యారు. సుడిగాలి సుధీర్,  గెటప్ శీను కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు.

ఇప్పుడు తాజాగా మరొక జడ్జి గా ఉన్న సింగర్ మనో కూడా వెళ్లి పోవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఈటీవీ వర్గాల నుండి కూడా కారణాలు ఉన్నాయి అన్నట్లుగా వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా డైరెక్షన్ టీమ్ లేకపోవడంతోపాటు టీమ్ లీడర్స్ కూడా లేకపోవడంతో ఈ షో వల్ల మనో కు పెద్దగా కలిసొచ్చే అవకాశం లేనందువల్ల ఈ షో నుండి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అందుచేత పదేపదే షెడ్యూల్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ వారం కూడా మనో లేకుండానే జబర్దస్త్ షో సాగిపోతోంది అని చెప్పవచ్చు. మరి వీరి స్థానంలో లైలా వస్తుంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: