టీవీ: చెయ్యి విరగొట్టుకున్న యాంకర్. కారణం..?

Divya
ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పేరు పొందింది దీప్తి.. యాంకర్ గా సత్తా చాటుతూ ఎంతోమందితో గుర్తింపు సంపాదించుకుంది దీప్తి. ఇమే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా యాంకరింగ్ లో పరిచయమై బుల్లితెర పైన ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లడం జరిగింది. అలా సీజన్-2 తో వెళ్ళిన ఈమె ఈ కార్యక్రమంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఈమె కెరీర్ మరింత బిజీగా మారిపోయింది.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉండేది. ఇక తనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అదేవిధంగా సొంతంగా తన యూట్యూబ్ ఛానల్ లో కూడా ప్రారంభించి అందులో వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దీప్తి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్టు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.
 యాంకర్ దీప్తి ప్రమాదవశాత్తు ఎడమచేతికి బాగా గాయాలు తగిలినట్లు గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎడమ చేతికి బ్యాండేజి ఉన్నట్లుగా ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాండ్ ఇంజురీ అంటూ ప్రమాదం జరిగిన విషయాన్ని కూడా తెలియజేసింది. ఈ ఫోటో కాస్త వైరల్ కావడంతో ఈమె అభిమానులు సైతం ఏం జరిగింది అంటూ కామెంట్లు చేయడమే కాకుండా.. మరికొంతమంది చెయ్యి విరిగెలా ఏం చేసావ్ అమ్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఎంతో దూకుడుగా చలాకీగా ఉండే దీప్తి ఇలా చెయ్యి విరగ కొట్టుకోవడం తో అభిమానులు సైతం పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: