
అఖిల్ సార్థక్ విన్ కాకపోవడానికి ప్రధాన కారణాలివే?
ఇది ఇప్పుడు చివరి దశకు చేరుకుంది మొదటి రెండు స్థానాలలో బిందు మాదవి మరియు అఖిల్ లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఫినాలే ఈ శనివారం జరుగనుంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో నటి బిందు మాదవి టైటిల్ ను ఎగరేసుకు పోతుందని ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో చాలా వరకు లీక్ అయినవే నిజం అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా నిజమేనని తెలుస్తోంది. దీనితో మరోసారి అఖిల్ కు ఓటమై తప్పడం లేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా చివరి వరకు తానే గెలుస్తాడని అనుకుని మోసపోయాడు.
ఇలా రెండు బుల్లితెరపై మరియు ఓ టి టి లోనూ రెండు దగ్గర్లా ఎందుకు అఖిల్ సార్థక్ విజాయ్న్ని సాధించలేకపోయాడు అంటే.. తన యొక్క ఆటిట్యూడ్ మరియు కన్నింగ్ మెంటాలిటీ ప్రధాన కారణాలు అని తెలుస్తోంది.. ఒక మనిషి దగ్గర ఏదైనా కావాలంటే వారిని ఎలాగైనా తన యొక్క గారడీ మాటలతో నమ్మించి తీసుకుంటాడు. కానీ అందులో నిజమైన ప్రేమ, స్నేహం బంధం లాంటివి ఉండవు. నిజంగా ఈ విషయాలను గమనించిన ప్రేక్షకులు కూడా అఖిల్ కు కాకుండా బిందు మాధవికి తమ ఓటు వేసి గెలిపించుకున్నారు.