టీవీ: ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా అనసూయ వీడియో వైరల్..!!
అనసూయ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా తన కుటుంబంతో సరదాగా గడిపిన ఒక వీడియోను కూడా షేర్ చేయగా ఇది నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. అనసూయ తన అందంతో యువతుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. బుల్లితెరవైపు వెండితెరపై తన అద్భుతమైన నటనతో వరస సినిమా అవకాశాలను అందుకుంటోంది. సాధారణంగా యాంకర్ నుంచి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా వెండితెరపై అలరిస్తూనే ఉన్నారు కానీ అనసూయ కథ లో తనకు మంచి పాత్ర నచ్చింది అంటేనే చేస్తుంది.
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ మే 15న 1985 లో జన్మించింది. 2013వ సంవత్సరంలో మొదటి సారిగా టెలివిజన్ ప్రెసిడెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది సత్తా చాటుతోంది. ఇక ఆమె పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అనసూయ ప్రతి సినిమాలో కూడా క్రేజీ రూల్స్ ని ప్లే చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. అనసూయ ప్రతి సినిమాలో కూడా ఎంతో నాచురల్ గా నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పెంచుకుంటూ పోతోంది. ఇటీవలె అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో డిఫరెంట్ రోల్ లో నటించింది.