టీవీ: ఆ యాంకర్ ని పొగడ్తలతో ముంచేసిన డైరెక్టర్.. కారణం..!!

Divya
బుల్లితెరపై యాంకర్ గా శ్రీముఖి ఎంత మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే వెండితెరపై కూడా అదే మార్క్ ను ఏర్పరచుకుంది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ బన్నీ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా నటించింది శ్రీముఖి. మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఇక ఈ మధ్యనే క్రేజీ అంకుల్స్ అనే  ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు శ్రీముఖి, బుల్లితెర, వెండితెర పై బిజీగా మారిపోయింది. ఇక బిగ్ బాస్ వంటి షోలో పాల్గొనడంతో ఈమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
బిగ్ బాస్ మూడవ సీజన్ లో గెస్ట్ గా చిరంజీవి వచ్చి సందడి చేయడం జరిగింది ఆ సమయంలో శ్రీముఖి చటుక్కున చిరంజీవి చెంప మీద ముద్దు పెట్టింది ఈ ఘటనతో చిరంజీవి చాలా షాక్ అయ్యారు మొత్తానికి ఇప్పుడు శ్రీముఖి ఏకంగా చిరంజీవి సినిమాలో నటించే స్థాయికి ఎదిగింది. డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లు భోళా శంకర్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం తమిళంలో వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిచడం జరుగుతోంది.

అయితే ఇందులో శ్రీముఖి కూడా ఒక చిన్న పాత్రలో నటిస్తోంది ఈ క్రమంలోనే డైరెక్టర్ మెహర్ రమేష్ తనకు పరిచయం ఏర్పడింది.. ఇక నిన్నటి రోజున శ్రీముఖి బర్త్ డే సందర్భంగా మెహర్ రమేష్ ఒక స్పెషల్ పోస్ట్ కూడా చేశారు శ్రీముఖి ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తెలియజేశాడు. దీంతోపాటుగా ఆమెకు బర్తడే విషెస్ కూడా తెలియజేయడం జరిగింది మెహర్ రమేష్. ఇక మెహర్ రమేష్ శ్రీముఖి ఇలా విషెస్ చెప్పడం తో శ్రీముఖి స్పందించి భోళా శంకర్ చిత్రం లో అవకాశం ఇచ్చినందుకు  థాంక్స్ సార్ అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: