టీవీ: ఆ ఒక్క మాట తో కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ కామెడీయన్..!!

Divya
ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా బాగానే పెరిగిపోయింది. అందుచేతనే ప్రస్తుతం పలు కార్యక్రమాలపై ప్రేక్షకులకు బాగా ఆసక్తి కూడా పెరుగుతోంది. ఎంతో ఇంట్రెస్ట్ గా సాగే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లో సైతం విడుదల చేస్తూ ఉంటాయి ఆయా చానల్ సంస్థలు. ఇలాంటి క్రమంలోనే విడుదలైన ప్రతి ప్రోమో కూడా ఒక స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు మాత్రమే ఈ ప్రోమో లలో కనిపించే సెంటిమెంట్ ప్రేక్షకులను ఆ స్కిట్టు చూసేలా     ఆసెక్తి పెంచుతూ ఉంటుంది.
ఇక ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి ఎమోషనల్ కామెంట్ చేయడంతో ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టించింది. జబర్దస్త్ లో తనదైన శైలిలో పంచులతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది పంచ్ ప్రసాద్ గా పాపులారిటీ సంపాదించు కున్నాడు. అయితే పంచ్ ప్రసాద్ కి ప్రస్తుతం రెండు కిడ్నీలు దాదాపుగా 80% వరకు పాడైపోయాయట. అయితే తనకి ఆపరేషన్ చేయిస్తే మామూలు మనిషి అవుతాడు అని చెప్పడంతో అప్పట్లో జబర్దస్త్ కమెడియన్స్ అందరు కలిసి  నాగబాబుతో చెప్పడం జరిగింది.
అయితే తనకు ఇప్పటి వరకు ఎందుకు ఆపరేషన్ కాలేదు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇక ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో ఒక వ్యక్తికి తాను పని ప్రసాద్ అన్నకు పెద్ద అభిమానిని అని తెలియజేశాడు. ఈ క్రమంలోనే మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీ సమస్యను ఆలోచించి తను చాలా సార్లు బాధ పడ్డానని.. పంచ్ ప్రసాద్ అన్న కోసం తన కిడ్నీ కూడా దానం చేస్తానని ఆ అభిమాని తెలియజేశాడు. దీంతో ప్రసాద్ మాట్లాడుతూ మిమ్మల్ని నవ్వించడానికి నా లైఫ్ ఇంకొన్ని రోజులు దేవుడు పొడిగిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నానని  ఎమోషనల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: