"కార్తీకదీపం" సీరియల్ ను ఆపేయాలంటూ డిమాండ్ ?

VAMSI
టెలివిజన్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో నటులకు కూడా సినీ సెలబ్రెటీల రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటోంది. సీరియల్ లోని నటీనటులు ప్రేక్షకుల మనసుకు నచ్చితే చాలు ఇక ఆ సీరియల్ కు అనూహ్యంగా ఆదరణ పెరిగిపోతుంది. అసలు కేవలం తమ ఫేవరెట్ యాక్టర్స్ కోసమే సీరియల్ ను చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు అంటే ఇక సీరియల్ నటులకు దక్కుతున్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలా... ఇదే తరహాలో కార్తీక దీపం సీరియల్ తో లక్షలాది మంది ప్రేక్షక అభిమానాన్ని చూరగొన్నారు ఇందులోని కార్తిక్, దీపలు. వీరికి ఈ సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఏకంగా ఒక స్టార్ హీరోయిన్, స్టార్ హీరో రేంజ్ లో వీరికి క్రేజ్ పెరిగింది అనడం లో అతిశయోక్తి లేదు.
మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో కార్తీక దీపం ఒకటి. ప్రేక్షకుల మదిని గెలుచుకుని నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ ను ఇపుడు ఆపేయండి అంటూ దీప, కార్తిక్ ల ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో వంటలక్కగా దీప పాత్ర, అలాగే డాక్టర్ బాబుగా కార్తిక్ పాత్ర ప్రేక్షకుల మనసులోకి కాదు డైరెక్ట్ గా మైండ్ లోకే ఇంజెక్ట్ అయిపోయాయి. కాగా ఇపుడు ఈ పాత్రలకు ముగింపు పలుకుతూ దీప , కార్తిక్ పాత్రలను చంపేశారు. అయితే ఇపుడు వారి పిల్లల పాత్రలను కొనసాగిస్తూ లవ్ ట్రాక్ ను ఎంటర్ చేశారు. అయితే ఈ యాంగిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ దీప, కార్తిక్ పాత్రలకు ఫుల్ గా కనెక్ట్ అయిపోయిన ప్రేక్షక జనాలు దీప, కార్తిక్ లు లేని కార్తీకదీపం సీరియల్ ను చూడలేకపోతున్నాము ఈ సీరియల్ ను వెంటనే ఆపేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇదే మాట అంటుండడంతో ఈ సీరియల్ లో మళ్ళీ దీప , కార్తిక్ ల పాత్రలను తిరిగి ప్రవేశ పెడతారేమో అని  వినపడుతున్నాయి. వారు చనిపోవడం చూపించలేదు కాబట్టి.. యాక్సిడెంట్ తరవాత కోమాలో ఉండి ఇన్నాళ్టికి మళ్ళీ తిరిగి సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తారేమో అని సమాచారం. మరి సీరియల్ ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: