టీవీ: పనిమనిషితో ఫుల్ చిల్ అవుతున్న యాంకర్ సుమ..!!

Divya
టాలీవుడ్ లో యాంకర్ సుమ కనకాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈమె తెలియని వారంటూ ఎవరూ ఉండరు. యాంకర్ గా ఎంతటి గుర్తింపు తెచ్చుకుంది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా వెండి తెర పైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది సుమ. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది ఈమె. ఈ చిత్రం ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దీంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ పనులు చాలా వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
సాధారణంగా యాంకర్ సుమ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం తన కేమి కొత్తేమీ కాదు ఎందుకంటే తను ఇది వరకు కూడా ఇతర సినిమాల ప్రమోషన్లలో పాల్గొనడం జరిగింది. అయితే తాజాగా తన సినిమాకి తనే ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించింది. ఇకపైన జయమ్మ పంచాయతీ చిత్ర ప్రమోషన్ పనులలో భాగంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తన కాస్త రిలాక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంట్లో జరిగే కొన్ని ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది.
తన పని మనిషి గురించి ఎన్నో విషయాలు గతంలో కూడా తెలియజేసింది సుమ. అయితే ప్రస్తుతం సుమ తన పని మనిషి తో కలిసి కాస్త చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తన పని మనిషి తో మసాజ్ చేయించుకున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన తల మొత్తం సినిమా ప్రమోషన్లో తోనే నిండిపోయిందని.. ఇలా మసాజ్ చేయడంతో కాస్త రిలాక్స్ గా అనిపిస్తోంది అని సుమ తెలియజేసింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరి సినిమా సక్సెస్ కావాలని అందరం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: