టీవీ: సుడిగాలి సుదీర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు.!!

Divya
బుల్లితెరపై అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైనా కలిగి ఉన్నారు అంటే అది కేవలం సుడిగాలిసుధీర్ అని చెప్పవచ్చు.. తనదైన శైలిలో కామెడీ తో, అమాయకపు నటనతో ఎంతో మంది తన వైపుకు తిప్పుకున్నాడు సుధీర్. దీంతో అతని ఇష్టపడని అమ్మాయిల అంటూ ఎవరు ఉండరు. తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు సుధీర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. సుధీర్ మాట్లాడుతూ ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నారు చాలా సంతోషంగా సౌకర్యమైన జీవితాన్ని గడుపుతున్నాను కానీ గతంలో తమ ఫ్యామిలీ పడిన కష్టాలు చాలానే ఉన్నాయి అంటూ తెలియజేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలో తన తండ్రికి యాక్సిడెంట్ కావడంతో కాలికి ఫ్యాక్చర్ అయిందట. దీంతో తన తండ్రికి రెస్ట్ చాలా అవసరమని వైద్యులు చెప్పడంతో మధ్యలోనే తన చదువుని ఆపేసి ఇంటి బాధ్యతలు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు సుదీర్. అలా పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చాను. రామోజీ ఫిలిమ్ సిటీ లో ఎనిమిది వేలకు ఒక జాబ్ చేసే వాడిని.. అలా ప్రతి నెలా తన దగ్గర రూ.500 పెట్టుకొని.. మిగిలిన డబ్బు ని తన ఇంటికి పంపించే వాడిని తెలియజేశాడు. ఇక ఆ తరువాత రెండు సంవత్సరాలకి రూ.30వేలకు ఆ జీవితాన్ని పెంచారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది అని తెలియజేశారు.
అయితే ఆ తర్వాత మళ్లీ కష్టాలు ఎక్కువ అయ్యాయి దాంతో మూడు పూటల భోజనం తినకుండా.. కేవలం ఒక పూట భోజనం చేసి మిగిలిన రెండు పూటలా నీళ్ళతో కడుపు నింపుకునే వాడినని తెలియజేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ అవకాశం రావడంతో అప్పటి నుంచి తన జీవితం మారిపోయింది అని తెలియజేశారు. ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకులకు అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు సుధీర్. ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుండి వచ్చి ఎన్నో కష్టాలను దాటుకొని ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని తెలియజేశాడు సుధీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: