"సుధీర్ - రష్మీ"లు నిజ జీవితంలో ఒక్కటవుతారా... ?

VAMSI
గత పదేళ్లకు పైగానే బుల్లి తెరపై ఆనందమైన ప్రేమ జంటగా ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు యాంకర్ రేష్మి, సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోతో మొదలైన వీరి ప్రయాణం అలా సుందరమైన ప్రేమ కథలా కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ స్టేజ్ పై కలిసి కనపడితే చాలు ఏదో తెలియని మ్యాజిక్. వీరిని చూస్తుంటే మన గుండెల్లో ప్రేమ మ్యూజిక్ వినపడుతుంది అనడం అతిశయోక్తి కాదు. కళ్ళతోనే మాట్లాడుకునే ప్రేమ పక్షుల్లా బలే కవ్విస్తారు. వీరు ఆన్ స్క్రీన్ పైన మాత్రమే ఇలా ఉంటారా ? క్రేజ్ కోసమే ఇలా చేస్తున్నారా ? లేక ఆఫ్ స్క్రీన్ లో కూడా నిజంగా లవర్సేనా అన్న విషయం పక్కన పెడితే , వీరి జంట మాత్రం అదుర్స్. వీరు పెళ్లి బంధంతో ఒక్కటైతే చూడాలని అభిమానులంతా ఎంతగానో కోరుకుంటున్నారు.
అయితే రీసెంట్ గా హోలీ సంబరాల్లో భాగంగా స్టార్ మా ఛానల్ లో ఒక షోలో భాగమైన ఈ జంట. స్టేజ్ పై తమ తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంది. ఆ షోకి యాంకర్ గా  వ్యవహరించిన రవి, యాంకర్ రేష్మి ని మీరు సుదీర్ గురించి ఏమైనా చెప్పాలి అంటే ముందుగా ఏమి చెప్తారు అని అడుగగా.... అపుడు రేష్మి మేము కలిసిన ఈ 10 సంవత్సరాలలో ఒకసారి మా మధ్య చిన్న మిస్స్ అండర్స్టాండింగ్ జరిగింది. దాంతో ఇద్దరం రెండు రోజులు అస్సలు మాట్లాడుకోలేదు. కానీ ఆ తర్వాత సుదీర్  నేను సెట్ లో ఉన్న సమయంలో నాకు నచ్చిన స్వీట్ పంపించి మరీ మళ్ళీ నాతో మాట్లాడాడు, అది నాకు ఒక తియ్యటి జ్ఞాపకం అనే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది.
ఇక వీరిద్దరు స్టేజి పై తమ మాటలతో, కవ్వింతలతో ప్రేక్షకులను బాగా అలరించారు. సుడిగాలి సుదీర్ గురించి వేరే చెప్పాలా రేష్మి ని, తన అందాన్ని పొగుడుతూ ఆమెను చూస్తూ ఈ లోకాన్నే మరిచిపోయినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: