టీవీ: పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జబర్దస్త్ జడ్జి..!!

Divya
అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంతటి విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై మరింత ఆసక్తి నెలకొంది. దాదాపుగా మొదటి పార్ట్ 350 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఇక 2021 వ సంవత్సరంలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఇందులో బన్నీ, రష్మిక, తదితర నటులు యాక్టింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ రోజు అందరి నటన కారణంగానే ఈ సినిమా టాప్ లో నిలబడింది.


ఇక పార్ట్ -1 అన్ని కోట్లు కలెక్షన్ చేయడంతో పార్ట్-2  పై కూడా మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక అంతే కాకుండా ఈ చిత్రం పై ప్రత్యేకమైన శ్రద్ధ కూడా తీసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. అందుచేతనే ఈ సినిమాలో నటించే నటులు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నారు సుకుమార్. ఇప్పుడు తాజాగా మరో ఒక సీనియర్ హీరోయిన్ ను కూడా ఇందులో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ ఇంద్రజ. ఇక ఈ మధ్య కాలంలో పలు షో లలో  జడ్జి గా వ్యవహరిస్తూ మరింత క్రేజ్ ను అందుకుంది ఈమె.

ఇంద్రజ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడు వివాహం చేసుకొని నటనకు దూరం అయింది.. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కోసం వరుసగా వచ్చిన అవకాశాలను అందుకుంటూ కొనసాగుతోంది. ఇక పుష్ప -2 చిత్రంలో అవకాశం వచ్చినట్లుగా టాక్ బాగా వినిపిస్తోంది. ఇక ఈమెకు ఒక కీలకమైన పాత్ర కోసం సుకుమార్ ఈమెను సంప్రదించినట్లు గా తెలుస్తోంది.. ఇదే గనుక నిజమైతే ఈమె కెరియర్ మారిపోతుందని ఆమె అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కూడా అనుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: